Lalu Prasad Yadav: విదేశాలకు వెళ్లేందుకు లాలూకు కోర్టు గ్రీన్ సిగ్నల్

CBI court gives permission to Lalu Prasad to go to Singapore
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సింగపూర్ వెళ్లనున్న లాలూ
పాస్ పోర్టును రిలీజ్ చేసిన సీబీఐ కోర్టు
ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎట్టకేలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. పాస్ పోర్టును కూడా రిలీజ్ చేసింది. రేపు సాయంత్రంలోగా లాలూ ప్రసాద్ న్యాయవాదులకు సీబీఐ కోర్టు నుంచి పాస్ పోర్ట్ అందనుంది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం లాలూ ప్రసాద్ సింగపూర్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు అనుమతిని ఇవ్వాలని, పాస్ పోర్టును రిలీజ్ చేయాలని సీబీఐ కోర్టును ఆయన కోరారు. ఆయన విన్నపం పట్ల కోర్టు సానుకూలంగా స్పందించింది. లాలూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.
Lalu Prasad Yadav
RJD
CBI
Passport
Singapore

More Telugu News