PM Modi: తుంబుర చేతబూని చిడతలు వాయించిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!

PM Modi inaugurates Sant Tukaram temple in Pune
  • పూణేలో ప్రధాని మోదీ పర్యటన
  • డెహు ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవం
  • మోదీకి తుంబుర, చిడతలు బహూకరించిన ఆలయ వర్గాలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పూణేలో పర్యటించారు. ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధాని మోదీకి తుంబుర, చిడతలు బహూకరించారు. తుంబుర చేతబూనిన ప్రధాని మోదీ చిడతలను వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.
PM Modi
Sant Tukaram
Temple
Dehu
Pune

More Telugu News