Justice M Sathyanarayana Murthy: పదవీవిరమణ చేసిన ఏపీ హైకోర్టు జడ్జికి ఘనంగా వీడ్కోలు పలికిన రాజధాని రైతులు

Amaravathi farmers grand send off to retired AP High Court Judge
  • పదవీవిరమణ చేసిన జస్టిస్ సత్యనారాయణమూర్తి
  • నాడు అమరావతిపై చారిత్రాత్మక తీర్పు
  • కృతజ్ఞతలు తెలిపిన రైతులు
  • భారీ ఊరేగింపుతో వీడ్కోలు
ఏపీ హైకోర్టులో జడ్జిగా సేవలు అందించిన జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి నిన్న పదవీ విరమణ చేశారు. చివరి రోజున హైకోర్టులో లాంఛనాలు ముగించుకుని, అధికారికంగా రిటైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు. 

కాగా, పదవీ విరమణ చేసిన జస్టిస్ సత్యనారాయణమూర్తికి రాజధాని అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు నుంచి రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు పూలబాట పరిచారు. జడ్జి ఆ రోడ్డుపై వచ్చే సమయంలో రైతులందరూ చేతులు జోడించి నమస్కరించారు. మహిళలు, యువత బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆయనకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, భారీ ఊరేగింపుతో వీడ్కోలు పలికారు.
Justice M Sathyanarayana Murthy
Judge
Farwell
Farmers
Amaravati
AP High Court

More Telugu News