G. V. Harsha Kumar: వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలి: హర్షకుమార్

  • రాష్ట్రపతి ఎన్నిక ద్వారా చక్కని అవకాశం దక్కిందన్న మాజీ ఎంపీ
  • ఎన్నికను బహిష్కరిస్తామని ప్రకటిస్తే కేంద్రం దిగివస్తుందని సూచన
  • కేసులకు భయపడి మాట్లాడకుంటే అన్యాయం చేసిన వారు అవుతారన్న హర్షకుమార్ 
Ex MP Harshakumar demands ycp to boycott presidential election

రాష్ట్రపతి ఎన్నిక ద్వారా అపరిష్కృతంగా మిగిలిపోయిన రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకునే అవకాశం చిక్కిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రం దిగివస్తుందని, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని హర్షకుమార్ అన్నారు. 

రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ ఓట్లు కీలకంగా మారనున్నాయని, కాబట్టి ఈ అవకాశాన్ని అధికార వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటిస్తే కనుక కేంద్రం దిగివస్తుందన్నారు. ఇది రాష్ట్రానికి దక్కిన చక్కని అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసులకు భయపడి మాట్లాడకుంటే కనుక రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారని హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News