Andhra Pradesh: స‌జ్జ‌ల స‌హా మ‌రో ఇద్ద‌రు స‌ల‌హాదారుల ప‌దవీ కాలం పొడిగింపు

ap government extends sajjala and two more advisors services for one more year
  • ఈ నెల 18తో ముగియ‌నున్న స‌జ్జ‌ల ప‌ద‌వీ కాలం
  • మ‌రో ఏడాది పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలం పొడిగింపు
  • స‌జ్జ‌లతో పాటు జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, శామ్యూల్‌లకూ పొడిగింపు
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన స‌ల‌హాదారు అజేయ క‌ల్లం ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగించిన రాష్ట్ర ప్ర‌భుత్వం...మ‌రో ముగ్గురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలాన్ని కూడా పొడిగిస్తూ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏడాది పాటు ప‌ద‌వీ కాలం పొడిగింపు ద‌క్కిన వారిలో ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో పాటు జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, శామ్యూల్ ఉన్నారు. 

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న స‌జ్జ‌ల... వైసీపీ పాల‌న మొద‌లైన నాటి నుంచి ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే ఓ ద‌ఫా ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌గా... అది కూడా ఈ నెల 18తో ముగియ‌నుంద‌ట‌. దీంతో ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌జ్జ‌ల మాదిరిగానే జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, శామ్యూల్ పద‌వీ కాలాన్ని కూడా ప్ర‌భుత్వం పొడిగించింది.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Sajjala Ramakrishna Reddy
GVD Krshna Mohan
Samuel

More Telugu News