Nani: మంచి సినిమాలను మన భుజాలపై మోయాలి: నాని

  • ఈ నెల 10న విడుదలైన 'అంటే .. సుందరానికీ'
  • కొంతసేపటి క్రితం నిర్వహించిన సెలబ్రేషన్స్ 
  • మంచి సినిమాలను ప్రోత్సహించాలన్న నాని 
  • తన కెరియర్ లో చెప్పుకోదగిన సినిమా అంటూ కితాబు
Ante Sundaraniki movie celebrations

నాని - నజ్రియా జంటగా 'అంటే .. సుందరానికీ' రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన విడుదలైంది. ఈ సినిమా సెలబ్రేషన్స్ ను కొంత సేపటిక్రితం నిర్వహించారు. 

ఈ స్టేజ్ పై నాని మాట్లాడుతూ .. "ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుతున్నామని బ్యానర్ పెడితే, రిలీజై మూడు రోజులే కదా అయింది అనుకోవచ్చు. కానీ మేము లెక్కేసేది నెంబర్స్ ను కాదు ..  ప్రేక్షకుల ప్రేమను .. వాళ్ల హార్ట్స్ ను కౌంట్ చేస్తున్నాము. సినిమా చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసే తీరును చూసి, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వాళ్లు చూపించే ప్రేమను కొలమానంగా చూసుకుంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టే. ఇది మనందరం సెలబ్రేట్ చేసుకోవలసిన సినిమా. 

మాస్ సినిమా చేస్తే .. మంచి సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతారు. మంచి సినిమా చేస్తే వేరే సినిమాలతో కంపేర్ చేస్తారు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనమంతా కూడా దానిని భుజాలపై మోయాలి. అప్పుడే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగుల్లో మనమంతా  ఒక భాగమవుతాము. నా కెరియర్లో ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే, గొప్పగా కనిపించే సినిమాల జాబితాలో ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News