అడివి శేష్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కానుక
- ఇటీవల విడుదలైన మేజర్ చిత్రం
- నీరాజనాలు పడుతున్న ప్రేక్షకులు
- స్ఫూర్తిదాయక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు
- మహా సీఎంను కలిసిన మేజర్ టీమ్
ఈ నేపథ్యంలో, అడివి శేష్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభినందించారు. ముంబయిలో ఇవాళ మేజర్ టీమ్ సీఎం ఉద్ధవ్ థాకరేను కలిసింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశం గర్వించే సినిమా తీశారంటూ అడివి శేష్ ను కొనియాడారు. ఈ మేరకు అడివి శేష్ కు ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
కాగా, భారత సైనిక దళాల్లో ప్రవేశం (సీడీఏ, ఎన్ డీ ఏ) కోసం ఉత్సాహం చూపే వారికి సాయపడేందుకు సందీప్ ఉన్నికృష్ణన్ పేరిట నిధిని ఏర్పాటు చేయడంపై అడివి శేష్ సీఎం ఉద్ధవ్ థాకరేతో మాట్లాడారు. ఇది మంచి ఆలోచన అని అభినందించిన ఆయన, ఈ నిధికి తనవంతు తప్పకుండా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.