Odisha: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

5 dead in dreaded accident held in Alluri Sitharama Raju district
  • ఒడిశా నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
  • ప్రమాద స్థలంలో ముగ్గురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. బాధితులందరూ ఒడిశా వారే
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తున్న సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఒడిశాకు చెందిన ధనేశ్వర్ దళపతి (24), జీతు హరిజన్ (5), సునేనా హరిజన్ (2)తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Odisha
Vijayawada
Road Accident
Edugurallapalli
Alluri Sitharama Raju district

More Telugu News