Vizag: విశాఖలో ఉరుములు, మెరుపులు... కేంద్రమంత్రులకు ఇబ్బందికర పరిస్థితి

Dense clouds looms over Vizag as interruption to air traffic
  • విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం
  • విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • విశాఖ రావాల్సిన విమానాలు హైదరాబాద్ కు మళ్లింపు
  • ఢిల్లీ నుంచి విశాఖ వస్తున్న విమానం వెనక్కి!
  • విమానంలో కేంద్రమంత్రి ఎస్.జై శంకర్
విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకోవడంతో ఉరుములు, మెరుపులతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్ కు మళ్లించారు. 

ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఓ విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఉన్నారు. ఇక, ఢిల్లీ విమానం రాకపోవడంతో మరో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీ విశాఖలోనే నిలిచిపోయారు.
.
Vizag
Weather
Clouds
Thunders
Flights

More Telugu News