Anushka Sharma: పెళ్లయినా.. తగ్గదే లేదంటున్న అనుష్క శర్మ

Anushka Sharma shares pics in orange swimsuit as she clicks herself on vacation with Virat Kohli
  • మాల్దీవుల్లో సముద్ర తీరంలో హల్ చల్
  • స్విమ్ సూట్ ధరించి సెల్ఫీలు
  • వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన నటి
విరాట్ కోహ్లీని పెళ్లాడిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. తన స్వేచ్ఛ విషయంలో తగ్గేదే లేదంటోంది. స్విమ్ సూట్ తో ఫోటోలు దిగి హల్ చల్ చేసింది. నెట్ ఫ్లిక్స్ షో ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న అనుష్క భర్త విరాట్ కోహ్లీతో మాల్దీవుల పర్యటనకు వెళ్లింది. అక్కడ స్విమ్ సూట్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ పై తనను తానే ఫొటోలు తీసుకుని వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. 

‘ఫొటోలను షేరు చేస్తూ.. ‘మీ ఫొటోలను మీరే తీసుకుంటే వచ్చే ఫలితం ఇది’అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఆరెంజ్ స్విమ్ సూట్ ధరించిన ఆమె తలకు టోపీ కూడా పెట్టుకుని కనిపించింది. బీచ్ ఒడ్డున ఎండ మండిపోతోంది. అందుకే ఆమె టోపీ ధరించింది. నటి రుహాని శర్మ క్యూట్ అంటూ కామెంట్ పెట్టింది. ఒక అభిమాని అయితే రెచ్చిపోయి మరీ.. ‘నీవు ఎంతో హాట్. హాట్ నెస్ లో నిన్ను ఎవరూ బీట్ చేయలేరు’అని కామెంట్ చేశారు. చాలా మంది వెరీ హాట్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ స్పందన తెలియజేస్తున్నారు. కూతురు వామికతో కలసి కోహ్లీ జంట కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు చెక్కేసింది. 
Anushka Sharma
swimsuit
Maldives
shares pics

More Telugu News