Srikanthachary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం.. కేఏ పాల్ వద్ద ఉండొచ్చంటూ ఆయన భార్య ఫిర్యాదు

Srikanthachari Father Venkatachari Missing
  • తెలంగాణ మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి
  • ఈ నెల 1న పని కోసం బయటకు వెళ్తున్నట్టు చెప్పిన వెంకటాచారి
  • 2న సోషల్ మీడియాలో కనిపించారన్న భార్య
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అసువులు బాసిన కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 1న మధ్యాహ్నం పని కోసం బయటకు వెళ్తున్నట్టు చెప్పిన ఆయన జాడ ఆ తర్వాత తెలియరాలేదు. అయితే, జూన్ 2న ఆయన సోషల్ మీడియాలో కనిపించారని వెంకటాచారి భార్య శంకరమ్మ పేర్కొన్నారు.

ఆ తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అన్నారు. దీంతో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద తన భర్త ఆశ్రయం పొందుతూ ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Srikanthachary
Venkatachari
Telangana
KA Paul

More Telugu News