Telangana: పెరుగుతున్న కరోనా కేసులు... విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

  • దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి
  • తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల
  • వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు
  • త్వరలో ప్రకటన చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
Telangana govt will decide on schools reopening

దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజా విద్యాసంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. 

అయితే, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు ఇంకా పెరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో, విద్యాసంస్థలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దీనిపై తెలంగాణ సర్కారు త్వరలోనే ప్రకటన చేయనుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 155 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

More Telugu News