MS Raju: అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పే: ఎమ్మెస్ రాజు

MS Raju Interview
  • నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచి పేరు 
  • దర్శకుడిగా హిట్స్ అందుకునే ప్రయత్నం 
  • ఆయన తాజా చిత్రంగా రిలీజ్ అవుతున్న '7 డేస్ 6 నైట్స్' 
  • తన తనయుడికి హిట్ ఇస్తానంటూ వ్యాఖ్య
నిర్మాతగా ఎమ్మెస్ రాజు చాలా హిట్లు ఇచ్చారు .. దర్శకుడిగా కూడా హిట్లు ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తన తనయుడిని ఒక హీరోగా పెట్టి ఆయన '7 డేస్ 6 నైట్స్' సినిమాను రూపొందించారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. "నిర్మాతగా నేను చాలా హిట్లు ఇచ్చాను .. కానీ అది గతం. ఇప్పుడు దర్శకుడిగా నేనేమిటి అనేది నిరూపించుకోవాలని ఉంది. అందుకోసం కొత్తగా ఉన్న కథలను ఎంచుకుంటున్నాను. కథను బట్టే ఆర్టిస్టులను తీసుకుంటాను .. ఇందుకు మా అబ్బాయి కూడా మినహాయింపేమీ కాదు. 

ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మా అబ్బాయికి  పెద్ద హిట్ ఇవ్వగలననే నమ్మకంతో ఉన్నాను. తనని హీరోగా నేను పరిచయం చేయడమే కరెక్ట్ అని అప్పుడు అనిపించింది. కానీ అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పని ఇప్పుడు అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.
MS Raju
7Days 6 Nights Movie
Tollywood

More Telugu News