Waheeda Rehman: 84 ఏళ్ల వయసులో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ నటీమణి

Waheeda Rehman bought BMW 5 Series car
  • దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న వహీదా
  • తెలుగు సినిమాలలోనూ నటించిన వైనం
  • తాజాగా కొత్త కారును సొంతం చేసుకున్న నటి
  • కారును డెలివరీ ఇచ్చిన బీఎండబ్ల్యూ
బాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి చూపేవారికి సీనియర్ నటీమణి, అలనాటి అందాల భామ వహీదా రెహమాన్ తెలిసే ఉంటుంది. తన గ్లామర్ తో, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటి వహీదా రెహమాన్. ఆమె తెలుగులోనూ 'రోజులు మారాయి', 'బంగారు కలలు' వంటి సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆమె వయసు 84 ఏళ్లు. అయితే, ఈ లేటు వయసులో వహీదా రెహమాన్ తన ముచ్చట తీర్చుకున్నారు.

ఆమె తాజాగా బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఫేస్ లిఫ్ట్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ సెలూన్ కారును బీఎండబ్ల్యూ ప్రతినిధులు వహీదా రెహమాన్ కు అందించారు. కాగా, అటు విలాసం, ఇటు పనితనం.... ఏ విధంగా చూసినా బీఎండబ్ల్యూ కార్ల ప్రత్యేకత కనిపిస్తుంది. వహీదా కొనుగోలు చేసిన 5 సిరీస్ కారు ఎక్స్ షోరూం ధర రూ.64.50 లక్షల నుంచి రూ.74.50 లక్షల వరకు ఉంటుంది. వహీదా ఇప్పటివరకు హోండా అక్కార్డ్ కారు వినియోగించారు.
Waheeda Rehman
BMW
5 Series
Car
Bollywood

More Telugu News