Mamata Banerjee: బీజేపీ చేసిన పాపాలకు ప్రజలెందుకు బాధలు పడాలి?: మమతా బెనర్జీ

  • మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు
  • దేశవ్యాప్తంగా దుమారం.. పలు చోట్ల హింస
  • హౌరాలోనూ అల్లర్లు
  • తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ
Mamata Banergee fires in BJP over Howarah riots

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపుదాల్చుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోనూ అల్లర్లు చెలరేగడం పట్ల సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ చేసిన పాపాలకు ప్రజలెందుకు బాధలు అనుభవించాలని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పక్షాలే అల్లర్లను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. 

గత రెండ్రోజులుగా హింసాత్మక ఘటనలతో హౌరాలో సాధారణ జనజీవనం దెబ్బతిన్నదని మమత వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న హౌరాలో నిర్వహించిన ఆందోళనలో హింస చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కూడా హౌరాలో అల్లర్లు జరిగాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దాంతో ఈ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలపై బుధవారం వరకు నిషేధాజ్ఞలు విధించారు.

More Telugu News