Daggubati Purandeswari: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. పురందేశ్వరి వివరణ

Purandeshwari Explanation On NTR Photo On 100 Rs coin
  • ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానన్న పురందేశ్వరి 
  • అనుమతి వచ్చిందని తాను చెప్పలేదని వివరణ 
  • ఇటీవల అవధానం కార్యక్రమంలో ఎన్టీఆర్ వంద నాణెంపై మాట్లాడిన పురందేశ్వరి
వంద రూపాయల నాణెంపై నందమూరి తారకరామారావు బొమ్మకు సంబంధించి చేసిన కామెంట్లపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి వివరణ ఇచ్చారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పానేగానీ.. దానికి అనుమతి వచ్చిందని తాను చెప్పలేదని పేర్కొన్నారు. కాగా, ఇటీవల నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన అవధానం కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. 

ఆ సందర్భంలో ఎన్టీఆర్ కు భారతరత్న కోసం డిమాండ్ వస్తున్నదని చెప్పారు. అంతేగాకుండా వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు ఆర్బీఐతో సంప్రదింపులు జరిపామని, మరో ఆరు నెలల్లో ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆమె దాని గురించి క్లారిటీ ఇచ్చారు.
Daggubati Purandeswari
BJP
NTR

More Telugu News