ఈ నెల 25న వైసీపీ మెగా జాబ్ మేళా

YSRCP To Conduct Mega Job Mela On 25th
  • నిరుద్యోగుల కోసం వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా
  • ఈసారి కడప జిల్లా చాపాడులోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తామన్న విజయసాయి 
  • నేడు జాబ్ మేళాకు చెందిన పోస్టర్లు, వెబ్ సైట్ ప్రారంభం 
నిరుద్యోగుల కోసం వైఎస్సార్ సీపీ జాబ్ మేళాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను, వివరాలను విడుదల చేశారు. ఈ నెల 25న వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్ సైట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Kadapa District
Vijayasai Reddy
YSRCP

More Telugu News