RRB: ఆర్ఆర్‌బీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం.. ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే

  • రేపటి నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షలు
  • 17వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు 
  • అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరిన రైల్వే
South Central Railway announce special Trains for who appear for rrb exams

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

నేడు తిరుపతి-సేలం, సేలం-తిరుపతి (07675/07676), 12న తిరుపతి-సేలం (07441), 13న సేలం-తిరుపతి (07442), 13న షాలిమార్-సికింద్రాబాద్ (08025), 14న షాలిమార్-సికింద్రాబాద్ (08035), 16న సికింద్రాబాద్-షాలిమార్ (08026), 17న సికింద్రాబాద్-షాలిమార్ (08036) రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

More Telugu News