Telangana: విద్యార్థుల‌ రూట్ బ‌స్ పాస్ చార్జీల‌ను పెంచిన టీఎస్సార్టీసీ

  • ఒకేసారి మూడింత‌ల మేర పెంచిన వైనం
  • 8 కిలో మీటర్ల బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.165 నుంచి రూ.450కి పెంపు
  • 22 కిలో మీట‌ర్ల ధ‌ర‌ను రూ.330 నుంచి రూ.1,350కి పెంపు
tsrtc hikes students route bus pass fares

తెలంగాణలో పాఠ‌శాల‌ల పునఃప్రారంభం కానున్న స‌మ‌యంలో రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్సార్టీసీ) భారీ షాకిచ్చింది. విద్యార్థుల రూట్ బ‌స్ పాసుల ధ‌ర‌ల‌ను ఏకంగా మూడింత‌ల మేర పెంచింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం టీఎస్సార్టీసీ నుంచి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

విద్యార్థుల రూట్ బ‌స్ పాసుల్లో భాగంగా 4 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.165 చెల్లిస్తుంటే.. దానిని ఏకంగా రూ.450కి పెంచింది. అదే స‌మ‌యంలో 8 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.200గా ఉన్న ధ‌ర‌ను రూ.600ల‌కు పెంచింది. అదే మాదిరిగా 12 కిలో మీట‌ర్ల దూరానికి బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.245 నుంచి రూ.900ల‌కు పెంచింది. 18 కిలో మీట‌ర్ల దూరం బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.280 నుంచి రూ.1,150కి, 22 కిలో మీట‌ర్ల బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.330 నుంచి రూ.1,350కి పెంచింది. ఈ పెంపుతో విద్యార్థుల‌పై భారీ భారం ప‌డ‌నుంది.

More Telugu News