Varun Tej: భారీ యాక్షన్ సినిమా కోసం రెడీ అవుతున్న వరుణ్ తేజ్!

Varun Tej in Praveen Sattaru Movie
  • 'ఎఫ్ 3'తో హిట్ కొట్టిన వరుణ్ 
  • నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారుతో
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు
వరుణ్ తేజ్ ఇటీవల చేసిన 'గని' భారీ పరాజయాన్ని చవిచూసింది. అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమాపై వరుణ్ తేజ్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా గట్టిగానే కొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. తీరా చూస్తే థియేటర్ల దగ్గర జనమే కనిపించలేదు. ఓ మాదిరి వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టుకోలేకపోయింది. 

ఆ తరువాత వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. వరుణ్ తేజ్ కి మంచి హిట్ తెచ్చిపెట్టింది. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారుతో ఉంది.  ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.  త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. 

నాగార్జున హీరోగా 'ది ఘోస్ట్' సినిమాను రూపొందించిన ప్రవీణ్, ఆ సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాగానే ఆయన ఈ సినిమాపైకి రానున్నాడని అంటున్నారు. ఇది కూడా భారీ యాక్షన్ మూవీనే అని తెలుస్తోంది. ఇక 'జీ 5' కోసం ఒక భారీ వెబ్ సిరీస్ ను కూడా ప్రవీణ్ డైరెక్ట్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.
Varun Tej
Praveen Satthar
Tollywood

More Telugu News