Nayanthara: వివాదంలో నయనతార.. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచిన కొత్త పెళ్లికూతురు!

Nayanthara in controversy after walked with chappals in Tirumal Maada Veedhi
  • నిన్న ఘనంగా నయన్, విఘ్నేశ్ శివన్ ల వివాహం
  • ఈ రోజు శ్రీవారి దర్శనానికి వచ్చిన కొత్త జంట
  • వీరిని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
ప్రముఖ సినీ నటి నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్లి నిన్న అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్టులో వీరి వివాహం వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేశారు. వివాహానంతరం ఈరోజు వీరు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు, వీరిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. 

అయితే ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nayanthara
Tirumala
Chappals
Tollywood
Kollywood

More Telugu News