Thief: బ్రిడ్జిపై వేళ్లాడుతూ... రైల్లోని ప్రయాణికుడి ఫోన్ కొట్టేసిన దొంగ... వీడియో వైరల్

  • స్పైడర్ మ్యాన్ లా విన్యాసం చేసిన దొంగ
  • బ్రిడ్జి కమ్మీలు పట్టుకుని వేళ్లాడిన వైనం
  • కంపార్ట్ మెంట్ తలుపు వద్ద కూర్చున్న కుర్రాడు
  • కుర్రాడి చేతిలో ఫోన్ ను లాగేసుకున్న దొంగ
Thief snatches phone from moving train

స్పైడర్ మ్యాన్ సినిమాల్లో హీరో ఎత్తయిన బిల్డింగులను కూడా అవలీలగా ఎక్కేస్తుంటాడు. సాలీడు లక్షణాలతో సాహసాలు చేస్తూ దుష్టశక్తుల పనిబడుతుంటాడు. అయితే, బీహార్ లో ఓ దొంగ కూడా స్పైడర్ మ్యాన్ తరహా విన్యాసాలతో ఔరా అనిపించాడు. ఇతగాడు ఓ ఫోన్ ను చోరీ చేసిన విధానం మామూలుగా లేదు మరి! తాను ఓ బ్రిడ్జికి వేళ్లాడుతూ, నడుస్తున్న రైల్లోని ఓ ప్రయాణికుడి నుంచి అత్యంత లాఘవంగా ఫోన్ ను కొట్టేశాడు. 

బ్రిడ్జి కమ్మీలు పట్టుకుని వేళ్లాడుతున్న ఆ దొంగ... రైలు కంపార్ట్ మెంట్ తలుపు వద్ద కూర్చుని ఉన్న ఓ కుర్రాడి చేతిలో ఫోన్ ను లాగేసుకున్నాడు. అసలేం జరిగిందో కాసేపటికి అర్థం చేసుకున్న ఆ కుర్రాడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. బీహార్ లోని బేగుసరాయ్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News