Tollywood: అఫీషియల్.. బాలకృష్ణతో అనిల్​ రావిపూడి

Anil Ravipudi To Collaborate With Balakrishna for his next
  • ప్రకటించిన ఎఫ్ 3 డైరెక్టర్
  • బాలయ్య 108వ సినిమా ఖరారు
  • త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్న అనిల్
బాలకృష్ణ 108వ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఎఫ్ 3తో బంపర్ హిట్ కొట్టేసి మాంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించారు. ఇవాళ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. 

‘‘గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, బాలయ్య 107వ సినిమా టీజర్ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా 108వ సినిమా అప్ డేట్ తో బాలయ్య అభిమానులకు పండగే మరి!
Tollywood
Balakrishna
Anil Ravipudi

More Telugu News