56 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్.. ఫొటోలు ఇవిగో!

56 feet Sri Ram statue inaugurated by KTR
  • బండలింగాపూర్ లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విద్యాసాగర్ రావు
  • కేటీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
  • కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు
హిందూ భక్తులు శ్రీరామచంద్రుడిని ఎంతో భక్తితో పూజిస్తుంటారు. శ్రీరాముడి ఆశీస్సుల కోసం ఎంతో భక్తిభావంతో పూజలు చేస్తుంటారు. అనునిత్యం శ్రీరాముడి ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంటాయి. తాజాగా శ్రీరాముడి భారీ విగ్రహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, బండలింగాపూర్ లోని గండి హనుమాన్ ఆలయ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన 56 అడుగుల ఎత్తైన భారీ కోదండరాముడి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్ర కిరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. 
Go Back to Shorts
KTR
TRS
Sri Ram
Statue

More Telugu News