Thailand: గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ రికార్డు

  • గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటన
  • బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడంపై మాత్రం నిషేధం
  • వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
  • ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్ట్ అయిన నాలుగు వేల మందిని విడుదల చేయనున్న ప్రభుత్వం
Thailand just decriminalized cannabis

ఆసియా దేశం థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు నిన్న ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

అయితే, గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించారు. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.

వైద్య పరమైన ఉపయోగాల కోసమే గంజాయిని చట్టబద్ధం చేసే నిర్ణయం తీసుకున్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.

More Telugu News