Pooja Hegde: ఇండిగో ఉద్యోగి నాతో దురుసుగా ప్రవర్తించాడు: పూజాహెగ్డే

Pooja Hegde tweets about indigo staff rudish behaviour with her
  • ముంబైలో ఇండిగో ఫ్లైట్ ఎక్కిన పూజా హెగ్డే
  • ఇండిగో ఉద్యోగి విపుల్ న‌కాశే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోప‌ణ‌
  • అకారణంగా బెదిరింపు స్వ‌రంతో విరుచుకుప‌డ్డాడ‌ని వ్యాఖ్య‌
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించిన స్టార్ హీరోయిన్‌
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ పూజా హెగ్డే గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని పంచుకున్నారు. ఇండిగో విమాన‌యాన సంస్థ‌కు చెందిన ఓ ఉద్యోగి త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాధార‌ణంగా ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను తాను బ‌య‌ట‌కు చెప్పన‌ని, అయితే భ‌యంకర‌మైన ఈ ఘ‌ట‌న‌ను వెల్ల‌డించ‌డ‌మే మేల‌ని భావించాన‌ని స‌ద‌రు ట్వీట్‌లో పూజ తెలిపారు. 

ముంబై నుంచి బ‌య‌లుదేరిన ఇండిగో విమానంలో త‌న సన్నిహితుల‌తో కలిసి ప్రయాణించానని వివ‌రించిన పూజా... ఇండిగో ఉద్యోగి విపుల్ న‌కాశే త‌మ ప‌ట్ల దురుసుగా, అమర్యాదకరంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని తెలిపారు. అకార‌ణంగానే, త‌మ‌తో అత‌డు అహంకారం, అజ్ఞానంతో ప్రవర్తించి బెదిరింపు స్వరంతో విరుచుకుపడ్డాడని పూజ ఆరోపించారు.  
Pooja Hegde
Tollywood
Indigo
Twitter

More Telugu News