Bhima Koregaon: భీమా కోరేగావ్ అల్లర్ల కేసు.. ఆరు పార్టీల చీఫ్ లకు కమిషన్ నోటీసులు

Commission Summons Six Parties Chiefs On Bhima Koregaon Violence Case
  • శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎంఎన్ఎస్, వంచిత్ బహుజన్ అఘాడీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలకు సమన్లు
  • ఆ పార్టీల చీఫ్ లు వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం
  • జూన్ 30లోగా అఫిడవిట్లు వేసేందుకు అవకాశం

భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో ఆరు పార్టీల అధినేతలకు కోరేగావ్ భీమా జ్యుడీషియల్ కమిషన్ నోటీసులను ఇచ్చింది. శివసేన, బీజేపీ మహారాష్ట్ర చీఫ్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, వంచిత్ బహుజన్ అఘాడీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ లకు నోటీసులను అందించింది. 

వారు వ్యక్తిగతంగా లేదా వారి తరఫు ప్రతినిధి గానీ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో కమిషన్ చైర్ పర్సన్ కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జె.ఎన్. పటేల్ ఆదేశించారు. కేసుకు సంబంధించి జూన్ 30లోపు అఫిడవిట్లను సమర్పించాలని, మౌఖిక ఆధారాలను కమిషన్ కు సమర్పించాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీప్ శరద్ పవార్ కు నోటీసులిచ్చిన కమిషన్.. ఆయన వివరణ తీసుకుంది.

  • Loading...

More Telugu News