ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై ఢిల్లీ పోలీసుల కేసు
- యతి నరసింగానంద్ పైనా ఎఫ్ఐఆర్
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసు
- ఇప్పటికే నుపుర్ శర్మతో పాటు పలువురిపై ఇఫ్సో కేసులు
కాగా, మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇప్పటికే బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లపైనా ఇఫ్సో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారితో పాటు షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్లీ నదీమ్, అబ్దుర్ రహీమ్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షాకూన్ ల పేర్లనూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
వారందరిపై సెక్షన్ 153, 295, 505 కింద కేసులను నమోదు చేశారు. ఇటు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులను అందించనున్నారు.