Presidential Election: భారత రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ.. కొన్ని ఆసక్తికర అంశాలు!

Presidential Election Schedule To Be Announced Today
  • జులై 25న ముగియనున్న కోవింద్ పదవీకాలం
  • రాష్ట్రపతిని ఎన్నుకోనున్న ఎలక్టోరల్ కాలేజీ
  • బ్యాలెట్ పేపర్ విధానంలో జరగనున్న ఎన్నికలు
భారత రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. జులై 25న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ఆనాటి కల్లా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదిచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన చట్టసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 మంది లెజిస్లేటర్లు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ బలం 10,98,903 ఓట్లుగా ఉంటుంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభలోని నామినేటెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. వీరికి ఓటు ఉండదు. 

బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయకూడదు. ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.
Presidential Election
Schedule
EC

More Telugu News