Fire Accident: ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం... పెద్ద సంఖ్యలో వాహనాలు దగ్ధం

  • జామియా నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన
  • పార్కింగ్ ప్లేస్ లో ఎగసిపడిన అగ్నికీలలు
  • 90 వాహనాలు అగ్నికి ఆహుతి
  • 11 ఫైరింజన్ల సాయంతో మంటల ఆర్పివేత
Huge fire accident at Delhi metro station

ఢిల్లీలోని జామియా నగర్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి వాహనాల పార్కింగ్ ప్రదేశంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. ఈ ఘటనలో 90కి పైగా వాహనాలు దగ్ధమైనట్టు భావిస్తున్నారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో 11 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలను అదుపు చేయడంతో మరింత నష్టం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  భారీగా వాహన నష్టం చోటుచేసుకుంది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News