Adivi Shesh: సొంత బ్యానర్ స్పీడ్ పెంచుతున్న మహేశ్ బాబు!

  • ఈ నెల 3వ తేదీన విడుదలైన 'మేజర్'
  • తొలి రోజునే వచ్చిన సక్సెస్ టాక్
  • మహేశ్ సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది
  • మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న మహేశ్ 
Major movie update

మహేశ్ బాబు తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాడు. కథపై తనకి మరింత నమ్మకం కలిగితే ఆ సినిమాకి ఆయన నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అలా రీసెంట్ గా వచ్చిన 'సర్కారువారి పాట' సినిమాకి కూడా ఆయన ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఇక తన సినిమాలకి మాత్రమే కాకుండా ఇతర హీరోలతోను ఈ బ్యానర్లో సినిమాలు చేస్తామని చెప్పిన మహేశ్ బాబు, అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా చేశాడు. దేశభక్తితో కూడిన ఒక మేజర్ జీవిత కథ ఇది. ఈ నెల 3వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కమల్ 'విక్రమ్' పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడటం విశేషం.

'మేజర్' సినిమా విజయవంతం కావడంతో నిర్మాతగా మహేశ్ బాబు ఫుల్ ఖుషీ అవుతున్నాడు.  నిర్మాతగా ఈ సినిమా ప్రమోషన్స్ లోను ఆయన పాల్గొంటూ ఉండటం విశేషం. ఇకపై తన బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను వరుసగా నిర్మించే ఆలోచనలో ఆయన ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు స్పీడ్ అందుకున్నాయని అంటున్నారు.

More Telugu News