Nani: పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా 'అంటే .. సుందరానికీ' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • నాని హీరోగా రూపొందిన 'అంటే .. సుందరానికీ'
  • కథానాయికగా నజ్రియా పరిచయం 
  • రేపు సాయంత్రం శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల 
Ante Sundaraniki movie update

నాని నుంచి మరో విభిన్నమైన సినిమా రాబోతోంది .. ఆ సినిమా పేరే 'అంటే .. సుందరానికీ'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. నజ్రియా కథానాయికగా నటించిన ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన రేపటికి వాయిదా వేశారు. రేపు హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నారు. 

'శ్యామ్ సింగ రాయ్' తరువాత నానీ నుంచి, 'బ్రోచేవారెవరురా' హిట్ తరువాత వివేక్ ఆత్రేయ నుంచి వస్తున్న సినిమా కావడం,  కథానాయికగా నజ్రియా పరిచయమవుతుండటం ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది.  

More Telugu News