TSRTC: తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట.. ఒక్క రోజే రూ. 15.59 కోట్ల రాబడి

  • లక్ష్యానికి మించి అదనంగా రూ. 1.95 కోట్ల రాబడి
  • 34.69 లక్షల కిలోమీటర్ల మేర నడిచిన బస్సులు
  • 34.17 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ
  • కరోనా తర్వాత ఈ స్థాయిలో రాబడి రావడం ఇది రెండోసారన్న అధికారులు
 Cash crop for Telangana RTC  Over Rs 15 crore revenue yesterday alone

రాబడిలో తెలంగాణ ఆర్టీసీ నిన్న దుమ్ము రేపింది. ఏకంగా రూ. 15.59 కోట్లు ఆర్జించింది. అలాగే, ఆక్యుపెన్సీ కూడా 85.10 శాతం నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో ఆదాయం రావడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

నిన్న 34.69 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడవగా, మొత్తంగా 34.17 లక్షల మంది గమ్యస్థానాలకు చేరారు. నిజానికి నిన్న రూ.13.64 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా రూ.1.95 కోట్ల ఆదాయం రావడంతో అధికారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, కరోనా తర్వాత ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇది రెండోసారని అధికారులు తెలిపారు.

More Telugu News