Nani: ఆయన డేట్స్ అడిగితే కాదనేదే లేదు: నజ్రియా

  • మలయాళంలో నజ్రియాకి విపరీతమైన క్రేజ్
  • 'అంటే .. సుందరానికీ'తో తెలుగు తెరకి పరిచయం 
  • ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నజ్రియా 
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల
  • దర్శకుడు వివేక్ ఆత్రేయకు నజ్రియా ప్రశంసలు 
Nzriya  Interview

నాని హీరోగా 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ  దర్శకత్వం వహించాడు. మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో నజ్రియా మాట్లాడుతూ .. "మైత్రీ వారే 'పుష్ప' సినిమాతో మా వారు ఫహాద్ ను తెలుగు తెరకి పరిచయం చేశారు. ఆ సినిమా ఆయనకి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమాతో నన్ను పరిచయం చేస్తున్నారు. ఒకే సంస్థ ద్వారా మేము పరిచయం కావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

వివేక్ ఆత్రేయ కథ .. అందులో నా పాత్ర నచ్చడం వలన ఈ సినిమా చేశాను. ఫస్టు మూవీని నాని కాంబినేషన్లో చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వివేక్ ఆత్రేయ నాకు ఏదైతే చెప్పాడో అదే తీశాడు. ఆయన వర్కింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఆయన మళ్లీ ఎప్పుడు డేట్స్ కావాలన్నా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తాను" అంటూ ఆయనపై తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

More Telugu News