Diabetes: దేశంలో 150 శాతం పెరిగిన మధుమేహ రోగుల సంఖ్య... ఐసీఎంఆర్ వెల్లడి

  • ప్రపంచంలో రెండో స్థానంలో భారత్
  • ప్రతి ఆరుగురు షుగర్ పేషేంట్లలో ఒకరు ఇండియన్  
  • డయాబెటిస్ బాధితులపై కరోనా పంజా
ICMR says diabetes raises in country

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా నివేదికలో ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. దేశంలో మధుమేహ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని తెలిపింది. గత మూడు దశాబ్దాల కాలంలో డయాబెటిస్ తో బాధపడేవారి సంఖ్య 150 శాతం పెరిగిందని ఐసీఎంఆర్ వివరించింది. ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, ప్రపంచంలోని ప్రతి ఆరుగురు షుగర్ పేషెంట్లలో ఒకరు భారతీయులేనని పేర్కొంది. 

భారత్ లో కరోనా మహమ్మారి అత్యధిక సంఖ్యలో ప్రాణాలను బలిగొనడానికి ఈ డయాబెటిస్ కూడా ఓ కారణమని ఐసీఎంఆర్ తన నివేదికలో వెల్లడించింది. షుగర్ తో బాధపడుతున్న వారిపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని పేర్కొంది.

  • Loading...

More Telugu News