Monkeypox: 27 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ వైరస్

Monkepox spreads to 27 countries
  • ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 780 కేసుల నమోదు
  • ప్రపంచ వ్యాప్తంగా 66 మంది మృతి
  • యూపీలో ఒక బాలికలో మంకీపాక్స్ లక్షణాలు
మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ 27 దేశాలకు విస్తరించింది. 27 దేశాల్లో మొత్తం 780 మంకీపాక్స్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా... ఈ నెల 2వ తేదీ వరకు 780 కేసులు నిర్ధారణ అయ్యాయని చెప్పింది. మంకీపాక్స్ వల్ల ఈ ఏడాదిలో 7 దేశాల్లో 66 మంది మృతి చెందారని తెలిపింది. 

మన దేశంలో కూడా మంకీపాక్స్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాలిక శరీరంపై దద్దుర్లు, దురద ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆమె శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పరీక్ష కోసం పంపించారు. బాలికలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.
Monkeypox
Case
World
India

More Telugu News