MS Raju: బాలూ గారికి దేవిశ్రీ కోపం తెప్పించాడు: నిర్మాత ఎమ్మెస్ రాజు

  • నిర్మాతగా 'శత్రువు' సినిమాతో ఎమ్మెస్ రాజు కెరియర్  ప్రారంభం  
  •  తాజా ఇంటర్వ్యూలో 'దేవి' సినిమా ప్రస్తావన 
  • దేవిశ్రీని ఎలా పరిచయం చేసింది చెప్పిన ఎమ్మెస్ రాజు
MS Raju Interview

టాలీవుడ్ లో దర్శక నిర్మాతల్లో ఎమ్మెస్ రాజు ఒకరు. ఒకప్పుడు నిర్మాతగా ఆయన వరుస హిట్లను ఇచ్చారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. "నా బ్యానర్లో నేను చేసిన మొదటి సినిమా 'శత్రువు'. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక రకంగా అది మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. 

'దేవి' నా బ్యానర్లో చేసిన నాలుగో సినిమా. ఈ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కోసం నేను ఇళయరాజాను తీసుకుందామని వెళితే ఆయన కలవలేదు. ఆ పక్కనే దేవిశ్రీప్రసాద్ వాళ్లు ఉండేవాళ్లు. దేవిశ్రీ ఫాదర్ సత్యమూర్తి నాకు మంచి స్నేహితుడు. అందువలన ఆయన ఇంటికి వెళ్లాను. అప్పుడు దేవిశ్రీకి 15 .. 16 ఏళ్లుంటాయి. నేను వెళ్లేసరికి కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. 

నేను ఒక సందర్భం చెప్పి ట్యూన్ కట్టమని చెప్పేసి వచ్చాను. రెండు రోజుల్లోనే గొప్ప ట్యూన్ వినిపించాడు  .. దాంతో ఆ సినిమాకి ఆయనకి అవకాశం ఇచ్చాను. ఆ సినిమాకి తను రీ రికార్డింగ్ కూడా గొప్పగా చేశాడు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ఫస్టు టైమ్ బాలూగారితో పాడించాడు. బాలూగారు పాట బాగా వచ్చిందని చెబితే .. 'లేదు సార్ మరోసారి చేద్దాం' అన్నాడు. దాంతో ఆయనకి కోపం వచ్చేసింది. అప్పుడు ఆయనకి నేనే సర్దిచెప్పాను" అంటూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

More Telugu News