Hyderabad: భాగ్యన‌గ‌రిలో మ‌రో దారుణం... బ‌ర్త్‌డే పార్టీకి పిలిచి మైన‌ర్‌పై కారులో అఘాయిత్యం

a pesron arrested who rapes a minor girl in his car on necklace road
  • నెక్లెస్ రోడ్‌పై ప‌ట్ట‌ప‌గ‌లే ఘ‌ట‌న‌
  • కారులోనే బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ వైనం
  • బాలిక ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు
  • నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేసిన వైనం
తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మరో ఘోరం జరిగింది. ఇప్ప‌టికే జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్ద మైన‌ర్‌ బాలిక‌ను అప‌హ‌రించి కారులోనే ఆమెపై గ్యాంగ్ రేప్ జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో సోమ‌వారం మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌లో వేగంగా స్పందించిన పోలీసులు బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ సురేశ్ అనే యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ప‌గ‌లు నెక్లెస్ రోడ్‌పై చోటుచేసుకోవడం గ‌మ‌నార్హం. ఓ మైన‌ర్ బాలికను బ‌ర్త్ డే వేడుక‌ల కోస‌మంటూ నెక్లెస్ రోడ్‌కు తీసుకువ‌చ్చిన సురేశ్‌...నెక్లెస్ రోడ్‌పై కారులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘ‌ట‌న‌పై బాలిక ఫిర్యాదు చేసిన వెంట‌నే రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేశారు.
Hyderabad
Hyderabad Police
necklace road

More Telugu News