Google Pixel 6: అమెజాన్ పోర్టల్ లో గూగుల్ పిక్సల్ 6 విక్రయాలు.. ధర రూ.44,444

Google Pixel 6 available on Amazon for Rs 44444
  • పిక్సల్ 6 ప్రో లో రెండు వేరియంట్లు
  • 12 జీబీ, 128జీబీ ధర రూ.71,700
  • మరో హైఎండ్ మోడల్ ధర రూ.99,650
  • వీటికి విక్రయానంతర సేవలు ఉండవు

గూగుల్ పిక్సల్ 6, పిక్సల్ 6 ప్రో కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త! ఇవి ఇంకా భారత్ లో విడుదల కాలేదు. కానీ, అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో అమ్మకానికి దర్శనమిస్తున్నాయి. గతేడాదే వీటిని గూగుల్ అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. 

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గూగుల్ పిక్సల్ 6 సిరీస్ ఫోన్ ను అమెజాన్ పోర్టల్ లో కొనుగోలు చేసిన వారికి, ఆ తర్వాత సర్వీసింగ్ సదుపాయం ఉండదు. ఎందుకంటే వీటిని గూగుల్ భారత మార్కెట్లో విడుదల చేయలేదు. పిక్సల్ 6 ధర రూ.44,444. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. పిక్సల్ 6 ప్రో 12జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.71,700. 12జీబీ, 256జీబీ ధర రూ.99,650. సార్టా సన్నీ, స్టార్మీ బ్లాక్ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. దాదాపు అమెరికాలో ప్రకటించిన ధరల స్థాయిలోనే ఇవీ ఉన్నాయి. 

థర్డ్ పార్టీ విక్రయించే ఫోన్లు ఇవి. గూగుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు కనుక బాగానే ఉంటాయి. ఒకవేళ సమస్య ఏర్పడితే సర్వీసింగ్ ఉండదు. కనుక వీటిని అధికారికంగా భారత్ లో విడుదల చేసే వరకు వేచి చూడడం మంచిదని నిపుణుల సూచన. మరోపక్క, త్వరలోనే వీటిని భారత మార్కెట్లో విడుదల చేస్తామని గూగుల్ ఇప్పటికే ప్రకటించింది.

  • Loading...

More Telugu News