Rafael Nadal: మట్టికోట రారాజు రాఫెల్ నాదల్... రికార్డు స్థాయిలో 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

  • ఫైనల్లో కాస్పర్ రూడ్ పై ఏకపక్ష విజయం
  • వరుస సెట్లలో నెగ్గిన స్పెయిన్ వీరుడు
  • చివరి సెట్ లో విశ్వరూపం ప్రదర్శించిన నాదల్
  • ఫ్రెంచ్ ఓపెన్ లో తిరుగులేని ఆధిపత్యం
Rafael Nadal wins 14th French Open singles title

ఫ్రెంచ్ ఓపెన్ లో స్పెయిన్ వీరుడు రాఫెల్ నాదల్ ఆధిపత్యం మరోసారి రుజువైంది. క్లే కోర్టుల్లో ఎదురులేని నాదల్ రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు. రోలాండ్ గారోస్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-3, 6-0తో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను మట్టికరిపించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్... చివరి సెట్ లో పూర్తిగా చేతులెత్తేశాడు. బలమైన సర్వీసులు, వ్యాలీలు, రిటర్న్ లు, డ్రాప్ షాట్లతో నాదల్ తన ప్రత్యర్థిపై తిరుగులేని విధంగా పైచేయి సాధించాడు.

ఓవరాల్ గా ఇది నాదల్ కు 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడు నాదల్ ఒక్కడే. నాదల్ సమకాలికులు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు.

More Telugu News