Bangladesh: బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. 35 మంది మృతి..450 మందికి గాయాలు

35 dead over 450 wounded in massive blaze at inland container depot in Bangladesh
  • చిట్టగాంగ్ సమీపంలోని ఇన్ లాండ్ కంటెయినర్ లో భారీ ప్రమాదం
  • పెద్త ఎత్తున మంటలు, పొగలు
  • మంటలు విస్తరించకుండా చర్యలు
  • రసాయనాల వల్లేనన్న పోలీసులు  
పొరుగు దేశం బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీతాకుండ ప్రాంతంలోని ప్రైవేటు ఇన్ లాండ్ కంటెయినర్ లో  భారీ మంటలు ఎగసిపడ్డాయి. చిట్టగాంగ్ పోర్టు సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక నిరోధక విభాగం తీవ్రంగా శ్రమించింది. అగ్ని కీలలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది. 

ఆదివారం మధ్యాహ్నం వరకు 35 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో కనీసం 450 మంది వరకు మరణించి ఉంటారని అంచనా. నిల్వ ఉంచిన రసాయనాల వల్లే ప్రమాదం జరిగినటు పోలీసులు ప్రకటించారు. కంటెయినర్లలో మండే స్వభావం కలిగిన రసాయనాలు ఉండగా.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలినట్టు గుర్తించారు. 
Bangladesh
massive blaze
fire accident

More Telugu News