Iga Swaitek: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్

Polish star Iga Swaitek clinch her second French Open title

  • ఏకపక్షంగా సాగిన ఫైనల్
  • 6-1, 6-3తో కోకో గాఫ్ ను ఓడించిన స్వైటెక్
  • ఫ్రెంచ్ ఓపెన్ లో స్వైటెక్ కు ఇది రెండో టైటిల్
  • వరుసగా 35 మ్యాచ్ లు గెలిచి వీనస్ రికార్డు సమం చేసిన వైనం

ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను టాప్ ర్యాంక్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కైవసం చేసుకుంది. పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పోలెండ్ భామ ఇగా స్వైటెక్ 6-1, 6-3తో అమెరికా టీనేజర్ 18 ఏళ్ల కోకో గాఫ్ ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ లో స్వైటెక్ కు ఇది రెండో టైటిల్. గతంలో ఆమె 2020లోనూ ఇక్కడి క్లే కోర్టుపై విజేతగా నిలిచింది. 

కాగా, స్వైటెక్ కు ఈ మ్యాచ్ లో సాధించిన విజయం వరుసగా 35వది కావడం విశేషం. దీంతో, 2000 సంవత్సరంలో వీనస్ విలియమ్స్ నెలకొల్పిన 35 వరుస విజయాల రికార్డును స్వైటెక్ సమం చేసింది.

Iga Swaitek
French Open
Singles Title
Coco Gauff
Roland Garros
Tennis
  • Loading...

More Telugu News