Nara Lokesh: పదో తరగతి ఫలితాలనూ రాజకీయం చేసేశారు: నారా లోకేశ్

Lokesh Criticises Govt Decision on postponing tenth results
  • ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటు
  • పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆగ్రహం
  • ఇంత దరిద్ర పాలన ఎన్నడూ చూడలేదని కామెంట్
పదో తరగతి ఫలితాలను వాయిదా వేయడం పట్ల టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని, తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ఫలితాలను కూడా రాజకీయం చేశారంటూ విమర్శించారు. 

మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఫలితాల తేదీని ప్రకటించారన్న కారణంగా ఫలితాలను అకస్మాత్తుగా వాయిదా వేస్తారా? అని నిలదీశారు. ఫలితాలను వాయిదా వేసింది మంత్రి అలిగారనా? లేదా ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచక పాలనను చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Tenth Results

More Telugu News