V Srinivas Goud: వేడుక‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె రిసెప్ష‌న్‌... వ‌ధూవ‌రుల‌కు కేటీఆర్ గ్రీటింగ్స్‌

  • గ‌త నెల 26న వైభవంగా వివాహ వేడుక‌
  • శుక్ర‌వారం రిసెప్ష‌న్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్‌
  • విందుకు హాజ‌రైన కేటీఆర్‌
ktr attendsd minister srinivas goud daughter reception

టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ ప‌ర్యాట‌క‌, ఆబ్కారీ శాఖ‌ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె శ్రీహ‌ర్షిత వివాహం వంశీ కృష్ణ‌తో గ‌త నెల 26న వైభవంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహ వేడుక‌కు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్ర‌వారం హైదరాబాదులోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన కేటీఆర్‌...ఇరు కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

More Telugu News