R.Krishnaiah: త‌న‌పై న‌మోదైన నాన్ బెయిలబుల్ కేసుపై ఆర్.కృష్ణ‌య్య స్పంద‌న ఇదే

r krishnaiah respond on the case which was filed on him

  • ర‌వీంద‌ర్ రెడ్డి ఫిర్యాదుతో ఆర్.కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదు
  • రాజ‌కీయ కార‌ణాల‌తోనే కేసు పెట్టారన్న కృష్ణయ్య 
  • అక్ర‌మంగా డ‌బ్బులు వ‌సూలు చేసే వ్య‌క్తి తనపై కేసు పెట్టారని వ్యాఖ్య 
  • బాధితుల ప‌క్షాన పోరాడ‌ట‌మే త‌న నైజ‌మ‌న్న కృష్ణ‌య్య‌

త‌న భూమిని క‌బ్జా చేయ‌డంతో పాటుగా త‌న‌ను చంపేసేందుకు య‌త్నించారంటూ ర‌వీంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి ఫిర్యాదు ఆధారంగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య‌పై నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. కోర్టు ఆదేశాల‌తోనే హైద‌రాబాద్ ప‌రిధిలోని రాయ‌దుర్గం పోలీసులు కృష్ణ‌య్య‌తో పాటు మ‌రికొంద‌రిపైనా వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

ఈ కేసుపై తాజాగా ఆర్.కృష్ణ‌య్య స్పందించారు. రాజ‌కీయ కార‌ణాలతోనే త‌న‌పై కేసు పెట్టార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ ఆరోపించారు. అక్ర‌మంగా డ‌బ్బులు వ‌సూలు చేసే వ్య‌క్తి త‌న‌పై కేసు పెట్టార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. బాధితుల ప‌క్షాన పోరాటం చేయ‌డ‌మే త‌న నైజ‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

R.Krishnaiah
YSRCP
Rayadurgam PS
Non Bailable Case
  • Loading...

More Telugu News