Bandi Sanjay: కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay Counter to KTR
  • హైదరాబాద్ విముక్తిలో దారుసలేం ఏం చేసిందన్న సంజయ్ 
  • తెలంగాణ ప్రజలను చంపిన రజాకార్లతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారని విమర్శ 
  • గిరిజనుల పక్షాన అల్లూరి సీతారామరాజు పోరాడారని వివరణ 
బీజేపీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, ప్రజాస్వామిక ఉద్యమంలో బీజేపీ ఏ పాత్ర పోషించిందని కేటీఆర్ పశ్నించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ, ఆయన పూర్తి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారని ఆయన అన్నారు. రజాకార్ నేత ఖాసిం రజ్వీ, నిజాంల ఫొటోలను చూపించకపోవడంతో ఆయన అసహనానికి గురయినట్టున్నారని అన్నారు. 

హైదరాబాద్ విముక్తిలో దారుసలేం (ఎంఐఎం) ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి పార్టీతో కలిసి ఉన్న టీఆర్ఎస్ దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు. సొంత తెలంగాణ ప్రజలను చంపిన రజాకార్లతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని విమర్శించారు. అణచివేతకు గురవుతున్న గిరిజనుల పక్షాన అల్లూరి సీతారామరాజు పోరాడారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందే బీజేపీ నిర్ణయించుకుందని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News