Peddareddy: కొడతావా కొట్టు.. నిలదీసిన ముస్లిం వ్యక్తిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్య!

Tadpatri YSRCP MLA faces heat
  • గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పెద్దారెడ్డికి చేదు అనుభవం
  • మురుగునీటి సమస్యను కూడా పరిష్కరించలేదని నిలదీసిన గౌస్
  • కొడతావా కొట్టు అన్న పెద్దారెడ్డి
'గడప గడపకూ ప్రభుత్వం' కార్యక్రమంలో కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా యాడికి మండలం రామరాజుపల్లిలో పెద్దారెడ్డిని స్థానికులు నిలదీశారు. మురుగు నీరు ఇళ్ల ముందే నిలబడుతోందని గౌస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేని ప్రశ్నించారు. దీని వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నామని... స్థానిక నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

ఇక్కడున్న వాళ్లంతా ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. మురుగునీటి కాలువలే సరిగా చేయలేని వారు వేరే పనులు ఏం చేస్తారని ప్రశ్నించారు. దీంతో పెద్దారెడ్డి స్పందిస్తూ... 'ఏం కొడతావా.. కొట్టు' అని అన్నారు. ఆ తర్వాత స్థానిక నాయకులను పిలిచి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.
Peddareddy
Tadpatri
YSRCP

More Telugu News