GVL Narasimha Rao: రుషికొండకు మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదు.. అక్కడ రహస్యం ఏముంది?: జీవీఎల్

Why you are not sending us to Rushikonda asks GVL Narasimha Rao
  • వైజాగ్ లోని రుషికొండ తవ్వకాలపై విమర్శలు 
  • కొండ మొత్తాన్ని తొలిచినట్టున్నారన్న జీవీఎల్   
  • తవ్వకాల వివరాలు ఇవ్వాలని డిమాండ్ 
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్లకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రుషికొండలో ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు. 

కొండపై ఉన్న పాత హోటల్ పరిధి ఎంత ఉందో అంత ఆ మేరకే నిర్మాణం చేయాలని కోర్టులు కూడా స్పష్టం చేశాయని తెలిపారు. కొండ మొత్తాన్ని తొలిచినట్టున్నారని... అందుకే అక్కడకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. రుషికొండ తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
GVL Narasimha Rao
BJP
Rushikonda
YSRCP

More Telugu News