Bharat Singh Solanki: యువతితో హోటల్ రూమ్ లో కేంద్ర మాజీ మంత్రి... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. వీడియో చూడండి!

Union ex minister Bharat Singh Solanki caught red handed by his wife with another woman
  • దేశంలో అక్రమ సంబంధాలకు బలవుతున్న ఎన్నో కుటుంబాలు
  • తాజాగా పరువు పోగొట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి
  • భర్తతో ఉన్న యువతిని చితకబాదిన భార్య రేష్మ
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. శారీరక సుఖం కోసం ఎంతో మంది పక్కదోవ పడుతున్నారు. దీని కారణంగా పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయి. గౌరవప్రదంగా బతుకుతున్న వారు కూడా ఈ అక్రమ సంబంధాల కారణంగా పరువు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. 

తాజాగా ఇలాంటి వివాదంలో కేంద్ర మాజీ మంత్రి ఒకరు అడ్డంగా దొరికిపోయారు. తన వయసులో సగం వయసు కూడా లేని యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు భరత్ సింగ్ సోలంకి. రెండు సార్లు గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 

ఆనంద్ లోని ఓ హోటల్ లో యువతితో సోలంకి ఉన్న సమయంలో... హోటల్ గదిలోకి ఆయన భార్య రేష్మా పటేల్ ప్రవేశించారు. అక్కడి పరిస్థితి చూసి ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. తన భర్తతో ఉన్న యువతిని జుట్టుపట్టుకుని ఆమె చితకబాదారు. 

మరోవైపు తన భార్యను ఆపేందుకు సోలంకి ప్రయత్నించినా ఆమె తగ్గలేదు. తన భర్తతో ఉన్న నిన్ను వదిలి పెట్టను అంటూ ఆమె హెచ్చరించారు. అంతేకాదు రేష్మ సదరు తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఈ సందర్భంగా సదరు మహిళ ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bharat Singh Solanki
Congress
Illegal Contact
Wife

More Telugu News