Nani: 'అంటే .. సుందరానికీ' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • నాని తాజా చిత్రంగా 'అంటే .. సుందరానికీ'
  • ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న నజ్రియా 
  • వినోదమే ప్రధానంగా సాగే కథ 
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల
Ante Sundaraniki movie trailer released

ఈ మధ్య కాలంలో నాని విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తున్నాడు. లుక్ పరంగా కూడా ఈ మధ్య సినిమాకి .. సినిమాకి మధ్య కొత్తదనాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'అంటే .. సుందరానికీ' సినిమాలోను కొత్తగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 

'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ పరిచయం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఈ కథలో హీరో హీరోయిన్ల కులమతాలు వేరు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్లు ఒక ప్లాన్ చేస్తారు. పర్యవసానంగా వాళ్లకి ఎదురయ్యే పరిణామాలే ఈ సినిమా. అందుకు సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News